ప్రముఖ సంగీత విద్వాంసుడు, ఘంటసాల స్వరసహచరుడు, ఆయన సంగీత గురువు పట్రాయని సీతారామ శాస్త్రి కుమారుడు పట్రాయని సంగీతరావు కన్నుమూశారు. 101 యేళ్ళ వయస్సులో కరోనా వైరస్ సోకడంతో ఆయన చెన్నైలో బుధవారం చనిపోయారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈయన అంత్యక్రియలు గురువారం జరుగనున్నాయి.
కర్నాటక, హిందుస్థానీ సంగీతరీతుల్ని ఔపోషణ చేసిన పట్రాయని, హార్మోనియం, వీణ, వయోలిన్ వాయిద్యాల్లో మహాదిట్ట. ఆయన అసలు పేరు పట్రాయని వేంకట నరసింహమూర్తి. అయితే సంగీతజ్ఞుల కుటుంబానికి చెందిన తన బిడ్డ తప్పకుండా సంగీత విద్వాంసుడు అవుతాడన్న నమ్మకంత మాతృమూర్తి మంగమ్మ.. ఆయన్ను సంగీతరావు అని పిలిచవారు. తర్వాత ఆ పేరే ఆయనకు స్థిరపడింది.
అనేక కూచిపూడి నాటకాలకు సంగీతం అందించారు. 1956 నుంచి 1982 వరకు ఘంటసాల కుటుంబంలోనే పట్రాయని కుటుంబం ఉండేది. ఏపీ ప్రభుత్వం ఘంటసాల పురస్కారంతో సత్కరించగా, తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డుతో సత్కరించింది.