సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరజ్వాజ్ మరోమారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను వెనుకేసుకొచ్చారు. పవన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ, టీడీపీ నేతలకు ఆయన గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలతో కలిసి ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేక హోదా కోసం ఆయన తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం లెఫ్ట్ పార్టీలతో కలిసి పోరాటం చేస్తున్నారు.
అయితే, బీజేపీ, టీడీపీ నేతలు పవన్‌పై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా, వామపక్ష పార్టీలను లెఫ్ట్ - రైట్ పెట్టుకుని ఆయన ఆందోళన చేస్తున్నారంటూ మండిపడ్డారు. 2014లో జరిగిన ఎన్నికల సమయంలో నాటి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కూడా చంద్రబాబును - పవన్ కళ్యాణ్‌ను లెప్ట్ అండ్ రైట్ నిలబెట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు కదా అపుడు గుర్తులేదా లెఫ్ట్ అండ్ రైట్ అని తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. నా ఆలోచన పేరుతో ఆయన తన మనసులోని భావాలను వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్న విషయం తెల్సిందే. ఆ వీడియోను మీరూ తిలకించండి.