వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి.. ఇటలీకి పవన్-అన్నాతో ప్రయాణం

శనివారం, 28 అక్టోబరు 2023 (15:25 IST)
Pawan kalyan
మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలలో పాల్గొనేందుకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సతీసమేతంగా ఇటలీకి పయనమయ్యారు. ఈ ఏడాది జూన్ 9న హైదరాబాద్‌లో లావణ్య-వరుణ్‌లకు నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 1న మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేశారు. 
 
వీరికి ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. వరుణ్ వివాహానికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతున్నారు. రామ్ చరణ్ కొద్దిరోజుల క్రితం ఉపాసన, కూతురు క్లిన్ కారతో ఇటలీ వెళ్లారు. వరుణ్-లావణ్య నిన్న ఇటలీకి పయనమయ్యారు. 
 
ఈ రోజు పవన్ తన భార్యతో కలిసి ఇటలీ వెళ్లారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్-అన్నా లెజినోవా ఎయిర్ పోర్ట్‌లో దర్శనమిచ్చారు. మీడియా పవన్ దంపతులను తమ కెమెరాల్లో బంధించారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు