పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన స్నేహితుడు, చాలా సినిమాలకి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్, యాదాద్రి ఆలయ ముఖ్య ఆర్కిటెక్ట్ ఆనంద సాయిని తాజాగా అభినందించి తన కార్యాలయంలో సన్మానించారు. ఆనంద్ సాయి తండ్రి కూడా సినీ పరిశ్రమలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కావడంతో ముందు నుంచి సినీ పరిశ్రమలో తన తండ్రికి సహాయకుడిగా పని చేస్తూ తర్వాత తాను సొంతంగా ఆర్ట్ డైరెక్టర్‌గా మారి పలు సినిమాలకి వర్క్ చేసారు.