శ్రీరామ్ వేణు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రుతిహాసన్ కథానాయిక కాగా, కీలకపాత్రల్లో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.