''బాహుబలి'' సినిమాలో తమన్నా (అవంతిక) కోసం కొండలెక్కిన ప్రభాస్.. జిల్ ఫేమ్ రాధాకృష్ణతో చేసే సినిమా కోసం కొండలెక్కనున్నాడట. బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ సినిమా రూపుదిద్దుకుంటున్న సాహో సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ అబుదాబిలో చిత్రీకరించబడుతున్నాయి. ఈ సినిమా తరువాత ప్రభాస్ 'జిల్' ఫేమ్ రాధాకృష్ణతో ఒక సినిమా చేయనున్నాడు.
ఈ సినిమా కోసమే ప్రభాస్ కొండలనెక్కనున్నాడని టాక్. కథానాయిక కోసం కొండకోనల్లో అన్వేషణ చేస్తూ ఆయన ముందుకే సాగే సన్నివేశాలు వుంటాయనీ.. ఇవే సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయని సినీ వర్గాల సమాచారం. హీరోయిన్ వెదుక్కుంటూ కొండలెక్కి, ఆమెను కనుగొనే విధంగా స్క్రిప్ట్ వుంటుందట. ఈ సినిమా షూట్ మాత్రం కొండ కోనల్లో వుంటుందని తెలుస్తోంది.