పూనమ్ కౌర్‌కీ, ఓ నెటిజన్‌కీ మధ్య నడిచిన మాటల యుద్ధం ట్విట్టర్‌లో సంచలనంగా మారింది. మొదట పూనమ్ ఆంధ్ర, తెలంగాణ ఫైట్ చేసుకుంటూ ఉంటే ఫాయిదా ఎవరికీ అంటూ ట్వీట్ పెట్టడంతో వివాదం మొదలైంది.
ఆంధ్ర, తెలంగాణ మన వాళ్లే ఫైట్ చేసుకుంటూ ఉంటే.. ఫాయిదా ఎవరికి అబ్బా? నాకు అయితే ఏమీ అర్థం కావట్లే.. ఇదిగో ఈ స్కూల్ స్టోరీ గుర్తుకు వచ్చిందంటూ అంటూ పిల్లీ.. పిల్లీ కొట్టుకుంటుంటే మధ్యలో కోతి లాభ పడిన ఓ కార్టూన్‌ను పోస్ట్ చేసింది.
దీంతో పూనమ్.. ''నువ్వు ఎవరి డీపీ పెట్టుకున్నావో.. ఆయన విలువ తియ్యకు. నువ్వు అసభ్యకరమైన భాషను వాడుతున్నావా? సినిమానా పంచెస్ కొట్టడానికి... నీ వ్యాఖ్యలు రోత పుట్టిస్తున్నాయి. మనం మాట్లాడిన ప్రతిదాన్ని చాలా కుటుంబాలు, ప్రజలు చూస్తున్నారు'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.