రెండు బెత్తం దెబ్బలా? ఆ వ్యక్తిని నన్ను లక్ష్యం చేసుకుని పిచ్చి రాతలు: పూనం ఫైర్

శనివారం, 7 డిశెంబరు 2019 (19:50 IST)
రెండు బెత్తం దెబ్బలు అంటూ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి తను ట్వీట్ చేసినట్లు వైరల్ అవుతున్న వార్తలపై టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అది తన ట్విట్టర్ అకౌంట్ కానే కాదని వెల్లడించారు. కొన్ని మీడియా గ్రూపులు పనిగట్టుకుని తనపై దుష్ర్పచారం చేస్తున్నాయనీ, వారంతా సైకోల్లా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో తనకు అర్థం కావడంలేదన్నారు. 
 
ఎన్నికలు ఎప్పుడో అయిపోయాయి, అయినా తనను, ఆ వ్యక్తిని లక్ష్యం చేసుకుని పిచ్చి రాతలు రాస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి రాతలు రాసేవారంతా వేశ్యలతో సమానమంటూ ట్వీట్ చేశారు. అసమర్థులైన ఇలాంటి వారు తమ చుట్టువున్నవారి కోసం ఏమీ చేయలేరనీ, అలాంటివారు అసలు నాయకులు ఎలా అవుతారంటూ ప్రశ్నించారు. తన పేరుపై ఎవరో ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తుంటే దాన్ని ప్రచారం చేయడం దారుణమని పూనం ఆవేదన వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు