పవన్ - అను కాఫీ తాగుతూ వుంటే త్రివిక్రమ్ సెల్ఫీ .. అదుర్స్...

శనివారం, 4 నవంబరు 2017 (15:45 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి "అజ్ఞాతవాసి" అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. 
 
ప్రస్తుతం హైదరాబాద్‌లోనే చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో యూరప్‌కి వెళ్ళనుంది. అయితే ఈ మూవీ సెట్స్‌లో పవన్, అను ఇమ్మాన్యుయేల్ కాఫీ తాగుతుండగా, త్రివిక్రమ్ తనతో పాటు సెల్ఫీ తీసుకున్నాడు. ఈ పిక్‌ని అను తన ఫేస్‌బుక్ , ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసింది. 
 
ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గుడ్ కంపెనీ గుడ్ వర్క్ అనే కామెంట్‌తో అను ఆ సెల్ఫీనీ పోస్ట్ చేసింది. వంద కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. ఇది పవన్‌ 25 చిత్రం కాగా, పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. 


 

#Powerstar @PawanKalyan , Dir #TriVikram and @ItsAnuEmmanuel from #PSPK25 sets in #Bulgaria pic.twitter.com/gx6wnk1jxR

— Ramesh Bala (@rameshlaus) November 3, 2017

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు