Prabhas - Raja Saab release poster
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ రాజా సాబ్ నుంచి ప్రభాస్ బర్త్ డే అప్డేట్ వచ్చేసింది. కలర్ ఫుల్ పోస్టర్ తో ప్రభాస్ కు బర్త్ డే విశెస్ తెలియజేశారు మేకర్స్. మేళతాళాలతో ప్రభాస్ ను ఊరి ప్రజలు ఆహ్వానిస్తున్న స్టిల్ తో ఈ పోస్టర్ డిజైన్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రత్యేకమైన స్వాగ్, స్టైల్ లో ప్రభాస్ ఆకట్టుకుంటున్నారు. త్వరలో రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్ అనౌన్స్ చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమా కోసం క్రేజీ సాంగ్స్ కంపోజ్ చేశారు.