Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

దేవీ

మంగళవారం, 25 మార్చి 2025 (19:14 IST)
Ramcharan_ Fans ttitle
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను గత కొద్దిరోజులుగా హైదరాబాద్ శివార్లో బూత్ బంగ్లాలో వేసిన ప్రత్యేకమైన సెట్లో చిత్రీకరిస్తున్నారు. జగపతిబాబు, శివరాజ్ కుమార్ ఈ కీలక సన్నివేశాల్లో పాల్గొన్నారు. ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో సాగుతోందని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే మూడు జట్లుగా క్రికెట్ మ్యాచ్ లు పలు ప్రాంతాల్లో చిత్రీకరించారు.
 
కాగా, ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ లో పెద్ది రెడ్డి అంటూ రామ్ చరణ్ ను పిలుస్తుంటారట. వర్కింగ్ టైటిల్ లోఅదే పెట్టినట్లు తెలుస్తోంది. ఈనెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ను ప్రకటించే ఛాన్స్ వుంది. అప్పుడే తాజా అప్ డేట్ కూడా ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే రామ్ చరణ్ నేషనల్ ఫ్యాన్స్ తన సోషల్ మీడియాలో చిత్ర టైటిల్ పేరుతో ఓ పోస్టర్ ను కూడా విడుదలచేశారు. డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం తర్వాత రామ్ చరణ్ చేస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో పెద్ద క్రేజ్ వుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు