పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజున ప్రేమదేశపు యువరాణి రిలీజ్‌

మంగళవారం, 29 ఆగస్టు 2023 (15:57 IST)
Jana Sena spokesperson Rayapati Aruna launched the song sung by Sunitha.
పవన్‌కల్యాణ్‌ వీరాభిమాని అయిన సాయి సునీల్‌ నిమ్మల దర్శకత్వం వహించిన చిత్రం  ‘ప్రేమదేశపు యువరాణి’.  యామిన్‌ రాజ్‌, విరాట్‌ కార్తిక్‌, ప్రియాంక రేవ్రి కీలక పాత్రధారులు. ఏజీఈ క్రియేషన్స్‌, ఎస్‌2హెచ్‌2 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఆనంద్‌ వేమూరి, హరిప్రసాద్‌ సిహెచ్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని ‘మసకతడి’ పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోపాటను ఆవిష్కరించారు. ‘నిశబ్దం’ అంటూ సాగే పాటను జనసేన పార్టీ స్పోక్స్‌ పర్సన్‌ రాయపాటి అరుణ చేతుల మీదుగా విడుదల చేశారు.

అజయ్‌ పట్నాయక్‌ సంగీతం అందించిన ఈ పాటను సునీత ఆలపించారు. చిత్ర దర్శకుడే ఈ పాటను రాయడం విశేషం. పాటను విడుదల చేసిన అనంతరం రాయపాటి అరుణ చిత్రం బృందానికి  శుభాకాంక్షలు తెలిపి, సినిమా సక్సెస్‌ కావాలని అభిలషించారు. పవన్‌కల్యాణ్‌కు వీరాభిమాని అయిన దర్శకుడు సెప్టెంబర్‌ 2న పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమాను విడుదల చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఎమోషనల్‌గా బాండింగ్‌ ఉన్న సబ్జెక్‌ ఇది. ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కించాం. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అదే బాండింగ్‌తో సినిమా జ్ఞాపకాలను ఇంటికి తీసుకెళ్తారు. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. రాయపాటి అరుణగారు లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌, టీజర్‌, పాటలకు చక్కని స్పందన వచ్చింది. తాజాగా విడుదల చేసిన పాట కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. అలాగే సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు