24 ఏళ్ల అమ్మాయితో ప్రేమలో వున్నాను.. త్వరలో పెళ్లి: పృథ్వీరాజ్
శనివారం, 29 అక్టోబరు 2022 (15:03 IST)
Prithivee
పెళ్లి ఫేమ్ పృథ్వీరాజ్ రెండో పెళ్లి చేసుకోనున్నాడు. సహనటుడుగా, ప్రతి నాయకుడిగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు పృథ్వీ. కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా వున్న ఆయన త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.
కొద్దిరోజులుగా పృథ్వీ మలేషియాకు చెందిన 23 ఏళ్ల అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఆ వార్తలపై స్పందించారు పృథ్వీ.
అయితే ఆ అమ్మాయికి 23 ఏళ్లు కాదని.. 24 అని.. అలాగే.. ఇంకా తమకు పెళ్లి కాలేదని.. ప్రస్తుతం లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. ప్రేమకు వయసుతో సంబంధం లేదని.. ఆ అమ్మాయి మలేషియాకు చెందిన యువతి కాదని.. తెలుగమ్మాయి అని స్పష్టం చేశారు.
పృథ్వీరాజ్ 1994లో బీనాను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు విడాకులు తీసుకున్నారు. కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న పృథ్వీ తెలుగమ్మాయి అయిన శీతల్‌తో ప్రేమలో పడ్డారు. ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ఆ అమ్మాయి తనను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా వుందని.. ముందు తాను ఒప్పుకోలేదని చెప్పుకొచ్చాడు.
చాలా సమయం ఇచ్చానని.. ఆలోచించుకోమన్నానని పృథ్వీ తెలిపాడు. అందుకు ఆమె కుటుంబం కూడా పెళ్లికి ఒప్పుకుంది. అయితే త్వరలోనే శీతల్‌ను వివాహం చేసుకుంటానని.. ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకున్నామని.. తనపై నమ్మకం ఉందని అన్నారు.