భర్తకు సర్ ప్రైజ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా... జెట్‌లో కూర్చుని వెల్ కమ్.. మళ్లీ?

శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (21:29 IST)
Priyanka Chopra, Nick Jonas
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్తకు సర్ ప్రైజ్ ఇచ్చింది. ప్రియాంక చోప్రా భర్త జోనస్‌ 30వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే తన భర్తకు పుట్టినరోజు వేడుకలను ఊహించని విధంగా ఈమె ప్రత్యేక జెట్‌లో తన భర్తకు పుట్టినరోజు వేడుకలను జరిపారు. 
 
ఈ సర్‌ప్రైజ్ పార్టీకి సంబంధించిన వీడియోని నిక్ జోనాస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ వీడియోలో ప్రియాంక చోప్రా ముందుగానే జెట్‌లో కూర్చొని తన భర్తకు వెల్‌కమ్ చెప్పారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
 
ఇక 2018లో అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను ఈమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్దరూ సరోగసి పద్ధతి ద్వారా బిడ్డన కనిన సంగతి తెలిసిందే. తన కూతురికి ప్రియాంక చోప్రా మాల్టీ మేరీ చోప్రా జోనస్‌ అని నామకరణం కూడా చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు