బాలీవుడ్ అందాల తార, హాలీవుడ్ క్వాంటికో సీరియల్ నటి ప్రియాంక చోప్రా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మేనల్లుడిని ఎత్తుకుని ఆడించింది. ముంబైలోని మెహబూబా స్టూడియోకు అర్పితా ఖాన్ తన బిడ్డతో సహా స్టూడియోకు వచ్చింది. ఈ సందర్భంగా మూడు నెలలైన అహిల్‌ను ఎత్తుకుని ముద్దాడింది. ఇలా ప్రియాంక-అహిల్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా ప్రియాంక హాలీవుడ్ మూవీ బేవాచ్‌లోనూ, క్వాంటికో అనే సీరియల్‌లోనూ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లతో బిజీ అయిన ప్రియాంక చోప్రా.. ఇప్పుడే బాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇచ్చింది. అనుకోకుండా మెహబూబ్ స్టూడియోలో ప్రియాంకకు, అహిల్ ఇద్దరూ ఎదురయ్యారు. దీంతో మూడు నెలలున్న బిడ్డను ఎత్తుకుని ఆటాడించింది. ఇంకా ఓ లవ్లీ బాయ్‌ను మీట్ చేశానంటూ ట్వీట్ చేసింది.