హీరోయిన్ సాయిపల్లవితో కలిసి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ డ్యాన్స్ చేశారు. తన సమర్పణలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం తండేల్. ఈ నెల 7వ తేదీన విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 86 కోట్ల రూపాయల మేరకు వసూళ్లను రాబట్టింది.
ఈ నేపథ్యంలో గురువారం శ్రీకాకుళం వేదికగా ఈ చిత్రం థ్యాంక్యూ మీట్‌ను నిర్వహించారు. ఈవెంట్‌లో హీరోయిన్ సాయిపల్లవితో కలిసి నిర్మాత అల్లు అరవింద్ ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం ఈవెంట్‌కు హైలెట్‌గా నిలిచింది. అలాగే, నాగ చైతన్య కూడా డ్యాన్స్ చేసి ఆలరించారు. ఈ సందర్భంగా ఘన విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్లకు యూనిట్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
కాగా, జాలర్ల జీవన విధానాన్ని కళ్లకి కట్టిన సినిమా తండేల్. రాజుగా నాగ చైతన్య, బుజ్జి తల్లిగా సాయిపల్లవి కలిసి నటించారు. పాకిస్థాన్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. ఎమోషన్ అంతా రాజు, సత్యల మధ్యే నడుస్తుంది. సినిమా ప్రారంభం నుంచి ముగింపు కార్డు పలికేవరకు బుజ్జితల్లి, రాజుల ప్రేమతో నింపేశారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు బాగా దోహదపడింది. పాటలతో పాటు బీజేపీను అదరగొట్టేశారు.