చెట్టు పేరు, జాతి చెప్పుకుని కాయలు అమ్ముకునే వ్యక్తిని కాదు.. మంచు మనోజ్

ఠాగూర్

శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (12:57 IST)
తాను చెట్టు పేరు, జాతి చెప్పుకుని కాయలు అమ్ముకునే వ్యక్తిని కాదని హీరో మంచు మనోజ్ అన్నారు. గత కొన్ని రోజులుగా సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ విషయాలు రచ్చకెక్కిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, మోహన్ బాబు కుటుంబ ఆస్తుల అంశం కోర్టు వరకు చేరింది. మంచు మోహన్ బాబు, ఆయన ఇద్దరు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్‌లు పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నట్టు సమాచారం. అలాగే, కేసులో కూడా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ సినిమా కార్యక్రమంలో మంచు మనోజ్ పాల్గొన్నారు. 
 
ఇందులో ఆయన మాట్లాడుతూ, చెట్టు పేరు, జాతి పేరు చెప్పుకుని మార్కెట్‌లో కాయలు అమ్ముకునే వ్యక్తిని కాదన్నారు. మార్కెట్‌లో అమ్ముడుపోవడానికి తాను కాయో, పండునో కాదన్నారు. తనను తొక్కాలన్నా, పైకి లేపాలన్న ప్రేక్షకుల చేతుల్లోనే ఉందన్నారు. ప్రేక్షకులు మినహా మరెవరివల్లా సాధ్యం కాదన్నారు. తాను న్యాయం కోసం ఎంతదూరమైనా వెళ్తానని తెలిపారు. అది బయటైనా లేదా ఇంటివారైనా సరే అంటూ పరోక్షంగా మంచు విష్ణు కన్నప్ప సినిమాపై విమర్శలు గుప్పించారు. 
 
కోటి రూపాయలతో సినిమా తీస్తే అది చిన్నసినిమా కాదన్నారు. రూ.1000 కోట్లతో సినిమా తీస్తే అదిపెద్ద సినిమా అయిపోదన్నారు. సినిమా ఎప్పటికీ సినిమానే అని చెప్పారు. అయితే, ఆ సినిమా బాగుందా, బాగాలేదా, సినిమా చాలా గొప్పదా అని తేల్చాల్సింది ప్రేక్షకులు అన్నారు. పైగా, తాను ఎపుడూ ఒక సినిమాను మా అమ్మతో పోల్చుతానని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు