కన్నడ పవర్‌స్టార్ పునీత్‌రాజ్ కుమార్ ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోయిన ఓ అభిమాని కూడా గుండెపోటుతో మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని మరూర్ గ్రామానికి చెందిన మునియప్ప(28) రైతు. శుక్రవారం మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చిన అతడు..హీరో పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్తను టీవీలో చూసి తట్టుకోలేకపోయాడు. షాక్‌తో అక్కడికక్కడే గుండెపోటుతో కిందపడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో అతను ప్రాణాలు వదిలేశాడు.