ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఈ చిత్రం హక్కుల కోసం పలువురు పోటీ పడినప్పటికీ నా మీద నమ్మకముంచిన "బ్యాక్ డోర్" నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి, దర్శకుడు కర్రి బాలాజీలకు థాంక్స్ తెలియజేస్తున్నాను. దర్శకుడిగా ఈ చిత్రం బాలాజీకి చాలా మంచి పేరు తీసుకురావడం ఖాయం" అన్నారు.
"బ్యాక్ డోర్" కూడా అఖండ ఆదరణ పొందడం ఖాయమని అతిధులు ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కర్రి బాలాజితో "ఆనందభైరవి" చిత్రాన్ని నిర్మిస్తున్న బి.తిరుపతిరెడ్డి, "లాంప్" చిత్రం నిర్మిస్తున్న జనార్దన్ రెడ్డి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ రఘు, ఈ చిత్రం ప్రొడక్షన్ డిజైనర్. విజయ.ఎల్.కోట, పబ్లిసిటీ డిజైనర్ విక్రమ్ రమేష్, పి.ఆర్.ఓ. అప్పాజీ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, పబ్లిసిటీ డిజైనర్: విక్రమ్ రమేష్, కొరియోగ్రఫీ: రాజ్ కృష్ణ, పాటలు: నిర్మల- చాందిని, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్, ఆర్ట్: నాని, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, ప్రొడక్షన్ డిజైనర్: విజయ ఎల్.కోట, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ, కో-ప్రొడ్యూసర్: ఊట శ్రీను, రిలీజ్: కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్, నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి, రచన-దర్శకత్వం: కర్రి బాలాజీ!!