పాప ఏడుస్తుంటే ఆకలి అనుకున్నారు. ఎంత సముదాయించినా ఏడుపు ఆపకపోవడంతో పాటు ఊపిరాడకపోవడంతో ఆస్పత్రికి తీసుకుని పరుగులు తీశారు. అప్పుడు కానీ విషయం తెలియలేదు.. చిన్నారి గొంతులో ఓ చిన్న బొమ్మ ఇరుక్కుందని. అప్పటికే పాప అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. డాక్టర్లు వెంటనే గొంతులోని బొమ్మను తలగించినా.. అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది.
ప్రతీష్ రెండేళ్ల కుమార్తె తిరిగి రానిలోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన హిందీ టీవీ ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది. ఆయన కూతురికి ఎలాంటి అనారోగ్యం లేదు.. కేవలం ప్లాస్టిక్ బొమ్మ గొంతులో ఇరుక్కుని చనిపోయిందని అందరూ చర్చించుకుంటున్నారు. దీంతో ప్రతీష్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. హిందీ బుల్లితెర నటులు ప్రతీష్ కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.