ప్రయాణికుల్లో చిన్న పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారని, వీరంతా గంటల తరబడి బంధీ అయ్యారని ఆమె పేర్కొన్నారు. సెక్యూరిటీ సిబ్బంది తలుపులు తెరవలేదని, విమానం రాకపై సిబ్బందికి ఖచ్చితంగా సమాచారం లేదని పోస్టులో తెలిపారు.
'సిబ్బంది విమానం ఎక్కలేదు. తదుపరి డ్యూటీకి వచ్చే సిబ్బంది కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నిసార్లు అడిగినా ఎలాంటి సమస్యా లేదని, విమానం వస్తుందని బుద్ది లేకుండా చెబుతున్నారు. నేను లోపల లాక్ అయ్యాను. మధ్యాహ్నం 12 గంటల వరకు ఇక్కడే ఉంటామని మాకు చెప్పారు. తాగునీరు కూడా లేదు' అని రాధికా ఆప్టే ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చారు.