కర్నాటక బోర్డర్ నుంచి చెన్నై, తర్వాత హైదరాబాద్ వచ్చి అంతర్జాతీయ గుర్తింపు పొందిన రాజమౌళికి మలయాళీయులతోనూ సంబంధాలున్నాయి. శాంతినివాసం సీరియల్ షూటింగ్ లోవుండగా రైటర్ నన్ను యంద మాషె అని పిలిచేవారు. దాని అర్థం ఏమిటని అంటే.. ఏంటీ బాస్.. అని అర్థం అని చెప్పారు. అలా నా సినిమాలకు ఇతర టెక్నీషియన్స్ పనిచేస్తుంటే యంద యాషె అని పిలుస్తుండేవాడిని. ఓ సారి ఓ రచయితను అలానే పిలిచాను. తనూ యంద మాషె.. అని నన్ను పిలిచాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు అతనికి అనుమానం వచ్చి నన్ను మాషె.. అంటే అర్థం ఏమిటి? అని అడిగాడు.