ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబుతో రామ్ చరణ్- ఫోటో వైరల్

సెల్వి

బుధవారం, 12 జూన్ 2024 (19:43 IST)
Ramcharan
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. ఒక వీడియోలో, చెర్రీ నారా బ్రాహ్మణి పక్కన కూర్చున్నాడు. ఆ వీడియో కాస్త వైరల్ అయ్యింది. కార్యక్రమం అనంతరం చంద్రబాబు నాయుడును కూడా కలిసి చెర్రీ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఇటీవ‌ల టీడీపీ క్యాడ‌ర్‌లో రామ్ చ‌ర‌ణ్ అంటే అభిమానం పెరిగింది. సాధారణంగా సినీ తారలకు యమా క్రేజ్ వుంటుంది. ఇక  రాజకీయాల విషయానికి వస్తే వారు మరింత జాగ్రత్తగా ఉంటారు. అయితే గత ఏడాది టీడీపీ నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు చరణ్ ఎలాంటి అడ్డంకులు లేకుండా హాజరయ్యాడు. 
 
తెలుగు ప్రజల గర్వకారణమైన ఎన్‌టి రామారావుకు సంబంధించిన ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుండి మరే పెద్ద స్టార్ కూడా హాజరు కావడానికి సాహసించలేదు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్‌కు మద్దతు తెలిపాడు చెర్రీ.  అంటే ఎన్నికల సమయంలో కూటమికి పరోక్ష మద్దతు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు