లాక్‌డౌన్ దేశంలో పేరుగుతున్న గృహ హింస కేసుల నేపథ్యంలో ప్రభుతం తిరిగి మద్యం దుకాణాల ప్రారంభానికి అనుమతించడంతో పలువురు సినీ ప్రముఖులు ఆసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే మహిళలపై గృహ హింస కేసులు పెరిగిన క్రమంలో ప్రభుత్వం మద్యం దుకాణాల తెరిస్తే ఈ కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని, అంతేగాక దీని ప్రభావం కుటుంబ సభ్యులపై, పిల్లలపై తీవ్రంగా చూపుతుందని వారు ధ్వజమెత్తారు.
ఇకపోతే.. ఆర్జీవీ ట్వీట్‌కు బాలీవుడ్ సింగర్ సోనా మోహపత్రా స్పందిస్తూ.. ''డియర్ మిస్టర్ ఆర్జీవీ. అసలైన విద్యావంతులు ఏలా ఉండాలని నెర్పించే వ్యక్తుల వరుసలో మిమ్మల్ని ఈ ట్వీట్ చేరుస్తుంది. మహిళలకు, పురుషుల మాదిరిగా మద్యం కొనుగోలు, మద్యం సేవించే హక్కు ఉంది. అయితే మద్యం సేవించాక హింసాత్మకంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు'' అంటూ ఆర్జీవీపై ఆమె మండిపడ్డారు.