ఉగ్రవాదం, దేశ భక్తి, మత ఘర్షణల మీద ఇది వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఈ రిపబ్లిక్ డే (జనవరి 26)కి రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే చిత్రం విడుదలైంది. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ఈ సినిమాను రూపొందించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయాజుల హీరోగా పరిచయమయ్యారు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటించారు.
ఈ మూవీ విడుదలై మంచి ప్రశంసలను అందుకుంటున్న తరుణంలో దర్శకుడు మిహిరాం వైనతేయ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన సినిమా ప్రయాణంలో పడిన కష్టాన్ని, రామ్ మీద ప్రేక్షకులు కురిపిస్తున్న అభిమానం గురించి స్పందించారు.
చిన్నతనం నుంచి కూడా సినిమాలు అంటే ఇష్టం ఉండేది. ఇండస్ట్రీలోకి వచ్చి ఇరవై ఏళ్లు అవుతోంది. అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్‌గా చాలా మంది వద్ద పని చేశాను. ముత్యాల సుబ్బయ్య, తేజ, కృష్ణవంశీ ఇలా అందరి వద్దా పని చేశాను. ఆ తరువాత సొంతంగా కథలు, పాటలు రాయడం మొదలు పెట్టాను.
రామ్ అనే కథను ముందుగా హీరో రామ్ పోతినేని అనుకుని రాసుకున్నాను. ఆ తరువాత ఆది పినిశెట్టితో చేయాలని అనుకున్నాం. హీరోగా చేసిన సూర్య నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఓ సారి ఈ కథ చెప్పడం.. అల్లరి చిల్లరగా తిరిగే ఒక కుర్రాడు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి రెడీ అవ్వడం అన్న క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ విపరీతంగా నచ్చడంతో తాను చేస్తానని అన్నాడు. నేను కూడా ఓకే చెప్పాను.
ఆ టైంలోనే సూర్య దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ద్వారా నిర్మాతగా మారిపోయారు. ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ఈ సినిమాను నిర్మించేందుకు అంతా సిద్దమయ్యాం. క్యాస్టింగ్ కూడా ఫైనలైజ్ చేశాం. సాయి కుమార్ డేట్స్ కోసం కొన్ని రోజులు ఆగాల్సి వచ్చింది. అలా ఆగినందుకు సాయి కుమార్ గారు దొరకడం, ఆయన పాత్రకు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడం.. సినిమాకు మంచి పేరు వస్తుండటం చూస్తే ఆనందంగా ఉంది.
సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, భాను చందర్ ఇలా సీనియర్లతో పని చేయడంతో నేను ఎంతో నేర్చుకున్నాను. వాళ్లు సీనియర్ అయిన చాల సపోర్ట్ చేశారు ధన్య బాలకృష్ణ మాకు ముందు నుంచి ఎంతో సహకరిస్తూ వచ్చారు. ఆమె చేసిన ఓ సీన్‌కు అందరూ కంటతడి పెట్టేస్తున్నారు. హీరో సూర్య కొన్ని సీన్స్‌లో ఆశ్చర్యపరిచారు. ఇంకొన్ని సీన్లలో కాస్త ఇంప్రూవ్ అవ్వాలని అనిపించింది.
రామ్ నిర్మాణ సమయంలో అందరికీ ఆర్థిక సమస్యలు వచ్చాయి. రామ్ మూవీ జరుగుతున్న ఈ సినిమా కోసం మేం రెమ్యూనరేషన్ కూడా అంతగా తీసుకోలేదు. నిర్మాతకు భారం కాకూడదు, ముందు సినిమా బాగా రావాలనే తపనే ఉండేది. లొకేషన్ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చెయ్యకుండా పని చేశాం. మా డీఓపీ ధారన్ సుక్రికి కెమెరా లెన్స్ మార్చుకోవడానికి కూడా టైం ఇవ్వలేదు.
చిన్నతనం లో సంగీతం నేర్చుకున్న ఆ అనుభవం తోనే నేను రామ్ సినిమా కు అన్ని పాటలు రాసి మ్యూజిక్ చేసి అలేగే ఒక పాట కూడా పాడాను వీటితో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ చేశాను డైరెక్షన్ డైలాగ్స్ తో పాటు మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ రావడం తో సంతోషం గా ఉంది
ఫస్ట్ హాఫ్ ఎక్కువగా లవ్ ట్రాక్ హీరో ట్రైనింగ్ మీద నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ యూత్ కోసం తీశాను. సెకండాఫ్ ఫుల్ ఎమోషనల్‌గా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ కావాలనే అలాంటి గూస్ బంప్స్ వచ్చే సీన్స్ పెట్టాను. ఆ సీన్లకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకున్నాము కొత్త హీరో కి థియేటర్లో మేము అనుకున్నదానికన్న ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది అరుపులు ఈలలు వింటుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమాను థియేటర్‌లోనే చూడాలి. తప్పకుండా మా సినిమాను దగ్గర్లోని థియేటర్లో చూడండి.