న్యూ యార్క్ వెళ్లిన ఆది పురుష్ లోని రామ జోగయ్య శాస్త్రి పాట

మంగళవారం, 30 మే 2023 (10:51 IST)
Rama Jogaiah Shastri
ఆదియు అంతము .. రాముడిలోనే.. ఆ అనుభందం.. ఆప్తుడు భందువూ  అన్నీ తానె.. రామ్ సీతారాం.. రామ్.. జయ రామ్..  అంటూ తాను రాసిన పాటను  న్యూ యార్క్ టైం స్కెర్ లో పాట పాడుతూ తన్మత్యం పొందారు రామ జోగయ్య శాస్త్రి. ఆది పురుష్ లో ఈ పాటను దేశ దేశాల్లో తీసుకు వెళుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీతారాముల మధ్య పంచుకున్న లోతైన అనుబంధాన్ని స్పష్టంగా చిత్రీకరిస్తుంది. పాట ప్రారంభంలోనే, ఇది సీతారాముల జీవితంలో వారి బంధం ప్రాముఖ్యతను ప్రదర్శిస్తుంది. నిజమైన ప్రేమ యొక్క శాశ్వతమైన శక్తిని, మానవ భావోద్వేగాల యొక్క శాశ్వతమైన లోతును ఈ పాట గుర్తుచేస్తుండి అంటూ.. ఇలాంటి అవకాశం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. 
 
ఇతర దేశాల్లో లో ఈపాటను ప్రచారం చేసే పనిలో చిత్ర యూనిట్ ఉంది.  జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఆదిపురుష్‌ లో ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు