అయితే... ఈ రోజు రానా - మిహీకా నిశ్చితార్థం అని నిన్న వార్తలు వచ్చాయి. అయితే... ఆ వార్తలను సురేష్ బాబు ఖండించారు. కేవలం ఫ్యామిలీ మెంబర్స్ మీటింగ్ మాత్రమే అన్నారు. దీంతో అంతా నిజమే అనుకున్నారు అయితే.. ఈరోజు రానా - మిహీకా నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని కూడా రానా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియచేస్తూ... ఓ ఫోటో పోస్ట్ చేసి ఇట్స్ అఫిషియల్ అని అసలు విషయం చెప్పకనే చెప్పేసాడు.
రానా పోస్ట్ చేసిన ఫోటో చూసి జంట చూడచక్కగా ఉన్నారు అంటూ సోషల్ మీడియా ద్వారా ఈ జంటను సినీ ప్రముఖులు దీవిస్తున్నారు. అభినందనలు తెలియచేస్తున్నారు. పెళ్లి కూతురు మిహీకా బజాజ్ విషయానికి వస్తే... ఈమె హైదరాబాద్‌కు చెందిన అమ్మాయే. బంటీ బజాజ్, సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె మిహికా.