విరాట పర్వం నుంచి రానా లుక్.. నక్సలైట్‌గా..?

సోమవారం, 14 డిశెంబరు 2020 (09:58 IST)
Rana
రానా పుట్టిన రోజును పురస్కరించుకుని.. విరాట పర్వం నుంచి ఆయన లుక్‌ను విడుదల చేశారు. రానా దగ్గుబాటి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తాజాగా రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా నీది నాది ఒకే కథ ఫిలిం దర్శకుడు వేణు దర్శకత్వంలో విరాట పర్వం అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ ఫస్ట్ లుక్‌లో ప్రఆయన ఒక నక్సలైట్ యోధుడిగా కనిపిస్తున్నాడు.
 
ఇది ముందు నుంచి ఈ సినిమా నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రానాతో పాటు ప్రియమణి, జరీనా వాహబ్, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర వంటి వాళ్లు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ సమర్పిస్తూ ఉండగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమా బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు