ప్రచారమేకానీ పసలేని రావణాసుర రివ్యూ రిపోర్ట్‌

శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (12:12 IST)
Ravanasura poster
తారాగణం: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు.
 
సాంకేతిక విభాగం: స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ వర్మ, నిర్మాతలు: అభిషేక్ నామా, రవితేజ, కథ, & డైలాగ్స్ : శ్రీకాంత్ విస్సా, \సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో, డీవోపీ: విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటర్: నవీన్ నూలి 
 
కథ: 
ఫరియా అబ్దుల్లా పెద్ద లాయర్‌. కాలేజీలో తను రవితేజకు జూనియర్‌. ఆమె శ్రీరామ్‌ అనే వ్యక్తిని పెండ్లి చేసుకుంది. అలాంటి ఫరియా దగ్గర జూనియర్‌గా పనిచేస్తాడు రవితేజ. అతని సహ జూనియర్‌ హైపర్‌ ఆది. ఇద్దరూ తింగరిపనులు చేస్తుంటారు. ఇక సిటీలో బిగ్‌షాట్స్‌ ఒకేతరహాలో చనిపోతుంటారు. డిఐ.జి. మురళీశర్మ ఈ కేసును రెండు నెలల్లో రిటైర్‌ కానున్న జయరామ్‌కు అప్పగిస్తాడు. అక్కడనుంచి పలు మలుపులతో అసలు హంతకుడు రవితేజ అని తెలిసినా లా పాయింట్‌ ప్రకారం అరెస్ట్‌ చేయలేకపోతాడు జయరామ్‌. ఇక మేకప్‌లో ఆరితేరిన సుశాంత్‌ ఫేస్‌మాస్క్‌ విద్యతో రవితేజను పలు రకాల వ్యక్తులుగా మార్చి పలు హత్యలలో తాను ఇన్‌డైరెక్ట్‌గా ఇన్‌వాల్వ్‌ అలయ్యేలా చేయాల్సివస్తుంది. చివరగా సి.ఎం.ను హత్యచేసే బాధ్యతను రవితేజ తీసుకుంటాడు. ఆ తర్వాత ఏమయింది? అసలు ఇన్ని హత్యలు చేయడానికి రవితేజ ఎందుకు పూనుకున్నాడు? అనేది మిగిలిన కథ.
 
విశ్లేషణ:
థ్రిల్లర్‌ సినిమా అంటే సరైన ట్విస్ట్‌లు ఆకట్టుకునే సన్నివేశాలు వుండాలి. రావణాసుర సినిమాలో ఆ తరహాలో వెళ్ళినట్లున్నా గందరగోళంగా వుంటుంది. మొదటి భాగం వరకూ కథేమిటో ఎందుకు హత్యలు చేస్తున్నాడో అర్థంకాదు. దానికితోడు రేప్‌లు కూడా చేసింది ఇంగ్లీషు సినిమాల్లో చూపించినట్లుగా చూపిస్తాడు. అక్కడే జనాలకు బోర్‌కొట్టేసింది. 
 
సెకండాఫ్‌లో కథను రిలీవ్‌ చేయాలి గనుక వెంటవెంటనే ముడుపులు విప్పేశాడు దర్శకుడు. పోలీసు అధికారి జయరామ్‌ను చంపడానికి వస్తున్నాడు జాగ్రత్త అని బయటకు వచ్చి సుశాంత్‌ చెబితే వెంటనే అక్కడ రవితేజ ప్రత్యక్షమవుతాడు. ఇలా చాలా సీన్లు ఊహాజనికంగా రాసుకోవడంతోపాటు జీరో సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌ వున్నాయి. 
 
హీరో నెగెటివ్‌ షేడ్స్‌తో ముందుగా చూపించి ఆ తర్వాత హీరోయిజంగా తను చేసిన తప్పులు ఒప్పని చెప్పడం ఇలా సినిమాలు, టీవీల్లోనూ కనిపిస్తుంది. ఇప్పటివరకు ఎవరూ టచ్‌ చేయని పాయింట్‌ అంటూ ప్రచారం బాగా చేశారు కానీ ఇది ‘బిన్సీ డాల్‌’ అనే బెంగాలీ సినిమాకు రీమేక్‌ అనేది తెలుస్తుంది. ఇదే విషయాన్ని దర్శకుడు సుధీర్‌ వర్మ ఖండిరచాడు. అంతకుముందు ఆయన చేసిన సినిమా కూడాపెద్దగా సక్సెస్‌ కాలేదు. ఇంతోటి కథ కోసం ఐదుగురు హీరోయిన్లు పెట్టారు. 
మెడిసిన్‌ మాఫియా నేపథ్యంలో కథ సాగుతుందని మొదటి షాట్‌లో చూపిస్తాడు. మరలా ఎండ్‌లో వుంటుంది. ఈ పాయింట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. కొత్తగా అనేది హీరో విలన్‌గా చూపించడమే.
 
ఇక ఇందులో రవితేజ నటన, చురుకుదనం బాగుంది. వయస్సు అనేది తెలిసిపోతుంది. సుశాంత్‌ పాత్ర హైలైట్‌ అని చెప్పవచ్చు. ఐదుగురు హీరోయిన్లు వున్నా పెద్దగా ఒకరికి ఒకరు లింక్‌ వుండదు. వేరు వేరు సందర్భాలలో వస్తారు. అఖండ సినిమాలో చేసిన విలన్‌ నితిన్‌ మెహతా వీధిరౌడీగా చిన్న పాత్ర చేయడం విశేషం. మురళీ శర్మ, రావు రమేష్‌ పాత్రలు రొటీన్‌గా చేసివనే. మిగిలిన పాత్రలు వారి పరిధి మేరకు నటించాయి.
 
టెక్నికల్‌గా సంగీతం ఓకే. పాటలుమాస్‌ పాటలు. బయట హిట్‌ అయిన పాటలు తెరపై చూస్తే అంత కిక్‌ లేదు. సోసోగా అనిపిస్తాయి. కెమెరామెన్‌ పనితనంబాగుంది. సంభాషణల పరంగా శ్రీకాంత్‌ విస్సా చేసిన ప్రయత్నం రొటీన్‌గానే వుంది. దర్శకుడిగా సుధీర్‌ వర్మ మెడికల్‌ మాఫియా పాయింట్‌ తిప్పి తిప్పి ఏదో చేయబోయి ఏదో చేసినట్లుగా వుంది.
బలాలు: 
రవితేజ, సుశాంత్‌ పాత్రలు
లోపాలు:
సరైన కథ, కథనం, ఆకట్టుకునే అంశాలు లేకపోవడం ఊహాజనిక అంశాలు, జీరో సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్స్‌, కిక్‌లేనిపాటలు
రేటింగ్‌:2/5\

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు