లాటరీల మీద డిపెండయ్యేవాడిని కానంటున్న ర‌వితేజ‌

బుధవారం, 27 జులై 2022 (15:27 IST)
Rama Rao on duty, Ravi Teja
రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'రామారావు ఆన్ డ్యూటీ' జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లో రిలీజ్ అవుతుంది. శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన 'రామారావు ఆన్ డ్యూటీ' ట్రైలర్ సినిమాపై క్యురియాసిటీని పెంచింది. సినిమా విడుదలకు రెండు రోజులు వుండగా 'రామారావు ఆన్ డ్యూటీ మాస్ నోటీస్ 'గా  మరో పవర్ ఫుల్ మాస్ యాక్షన్ మినీ ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్.
 
'రామారావు ఆన్ డ్యూటీ మాస్ నోటీస్' బ్రిలియంట్ యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్ తో అలరించింది. ''నేను లక్కుల మీద లాటరీల మీద డిపెండయ్యేవాడిని కాదు.. నా వర్క్ మీద డిపెండ్ అయ్యేవాడిని'' అని రవితేజ చెప్పిన డైలాగ్స్ థియేటర్ లో ఫ్యాన్స్ తో విజల్స్ వేయించే మూమెంట్ లా వుంది. ''మీ ఆయన మెరుపు లాంటి వాడు. శబ్దం లేకుండా వెలుగునిచ్చే రకం''అని తనికెళ్ళ భరణి చెప్పే డైలాగ్ రామారావు పాత్ర ఎంత పవర్ ఫుల్ గా వుంటుందో తెలియజేసింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ పవర్ ఫుల్ గా ఉంటూ అదే సమయంలో చాలా యూనిక్ గా వున్నాయి. సామ్ సిఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అవుట్ స్టాండింగా వుంది.  
 
దర్శకుడు శరత్ మాండవ ఫ్యాన్స్, మాస్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే ఎలిమెంట్స్ తో రామారావు అన్ డ్యూటీని సిద్ధం చేశారని ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే అర్ధమౌతుంది. విడుదలకు రెండు రోజులు ముందు చిత్ర యూనిట్ విడుదల చేసిన 'రామారావు ఆన్ డ్యూటీ మాస్ నోటీస్ ' సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది.
 
ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించగా, వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు.
 
జూలై 29న విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రవీణ్ కెఎల్ ఎడిటర్.
 
తారాగణం: రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ఫేమ్ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో ఫేమ్ శ్రీ, మధుసూదన్ రావు, సురేఖ వాణి తదితరులు.
 
సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: ఎస్‌ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్ పి, రవితేజ టీమ్‌వర్క్స్
సంగీతం: సామ్ సిఎస్
డివోపీ: సత్యన్ సూర్యన్ ఐఎస్సి
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు