ప్రమోషన్‌లో భాగంగా ఆయన ఇటీవలే ఓ మీడియాతో మాట్లాడుతూండగా, పాన్ ఇండియా సినిమాగా మీ సినిమా విడుదలవుతుంది అని అడిగితే, వెంటనే ఆయన.. అసలు పాన్ ఇండియా అనే పదం నాకు అర్థంకాదు. అది చాలా తప్పు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కూడా అప్పట్లో అన్ని భాషల్లోనూ విడుదలయ్యాయి. జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి. ఇప్పుడు పాన్ ఇండియ అంటుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ పదం నాకు నచ్చదు. ఇప్పుడు అన్ని దేశాల సినిమాలు భాషల సినిమాలు ప్రేక్షకులకు దగ్గరయ్యాయి. అందుకే ఐ హేట్ పాన్ ఇండియా పదం అన్నారు. సలు ఈ పదం పెట్టింది మీడియానే కదా! అంటూ ముగింపు సెటైర్ వేశారు.