హీరో రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం అయింది. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో ఈ చిత్రం రూపొందబోతోంది. పెళ్లి సందD చిత్రంతో కమర్షియల్ గా మంచి హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. తాజాగా ఈ చిత్రం రామానాయుడు స్టూడియోస్ లో ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు, నిర్మాత డి సురేష్ బాబు, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారు, దర్శక నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, నటుడు రఘు తదితరుల ఆశిస్సులతో పూజా కార్యక్రమాలు జరుపుకుని ప్రారంభమైంది. దర్శకులు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ ను అందజేయగా, నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.