రోహిత్ శెట్టి చేతికి గాయం.. సర్జరీ చేశారట..

శనివారం, 7 జనవరి 2023 (23:57 IST)
Rohit Shetty
బాలీవుడ్ సింగం సిరీస్ ఫేమ్ డైరక్ట్ రోహిత్ శెట్టి శనివారం నాడు హైదరాబాదులో తన ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే వెబ్ సిరీస్ షూటింగ్‌తో బిజీగా వున్నారు. 
 
హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతున్న సమయంలో రోహిత్ శెట్టి చేతికి పెద్ద గాయమైంది. వెంటనే చిత్ర బృందం రోహిత్ శెట్టని దగ్గర్లో ఉన్న కామినేని హాస్పిటల్స్‌కు తరలించారు. రోహిత్ శెట్టిని పరీక్షించిన డాక్టర్లు అతని చేతికి సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. 
 
ఇండియన్ పోలీస్ ఫోర్స్ మీద రాబోతున్న వెబ్ సిరీస్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఒక కీలకమైన షూటింగ్ షెడ్యూల్‌ను చిత్ర బృందం పూర్తి చేస్తోంది. 
 
ఈ నేపథ్యంలోనే కొన్ని కార్స్ హై ఆక్టేన్ ఎపిసోడ్‌లు కూడా చిత్రీకరిస్తున్నారు. దీనిలో భాగంగానే ఒక కార్ చేజ్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో రోహిత్ శెట్టి చేతికి గాయం అయినట్లు తెలుస్తోంది. సర్జరీ తర్వాత రోహిత్ శెట్టి కోలుకుంటున్నట్లు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు