లవర్ బాయ్ తరుణ్ చాలా గ్యాప్ తర్వాత వెండితెరపై కనిపించనున్నాడు. ''ఇది నా లవ్ స్టోరీ'' అనే టైటిల్‌తో రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ ట్రైలర్లో ''కాళ్లు కడిగి కన్యాదానం చేస్తే చాలు.. కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటాం''అని తన ప్రేయసితో తరుణ్ చెప్పుకొచ్చిన డైలాగ్ బాగుంది. ఇందులో తరుణ్ డైలాగ్స్ బాగున్నాయి. తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఓవియా ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. ఈ ట్రైలర్లో ఓవియాతో లవ్ సీన్స్ అదిరాయి.
రామ్ ఎంటర్టైనర్స్ పతాకంపై ప్రకాశ్ ఎస్వీ ఈ సినిమాని నిర్మించాడు. అంతా ఓకే అయితే ఫిబ్రవరి 14న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తరుణ్ పెళ్లి విషయం గురించి ఆయన తల్లి, నటి రోజా రమణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తరుణ్‌కు మంచి అమ్మాయి దొరికినే వెంటనే పెళ్లి చేసేస్తామని రోజా రమణి తెలిపారు. తన కుమార్తె అమూల్య ఇంటీరియర్ డిజైనింగ్ చేసిందని... తన ప్రాజెక్టుల్లో బిజీగా ఉందని... మంచి అమ్మాయి, మంచి అబ్బాయి దొరికితే ఇద్దరికీ పెళ్లి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఇద్దరికీ అమ్మాయి, అబ్బాయి వెతికే పనిలో పడ్డామని తెలిపారు. బహుశా ఈ వార్తను ఈ ఏడాదిలోనే వినవచ్చని తెలిపారు.