సాయి పల్లవి ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. అయితే సాయిపల్లవికి పెళ్లి అనుకునేరు. అదే కాదు. సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. తాజాగా తన ప్రేమ విషయం బయటపెట్టింది పూజా. ఇన్నాళ్లు తన క్రైం పార్ట్నర్ అయిన వినీత్ అనే వ్యక్తి ఇప్పుడు తన లైఫ్ పార్ట్నర్ కాబోతున్నాడంటూ తనకు కాబోయే భర్తను అభిమానులకు పరిచయం చేస్తూ.. అతడి ఫోటోను షేర్ చేసింది.