#SaveNallamala-ఉద్యమానికి సినీ ప్రముఖుల మద్దతు

ఆదివారం, 15 సెప్టెంబరు 2019 (13:35 IST)
సమంత, విజయ్ దేవరకొండ నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు వద్దంటూ సాగుతున్న ఉద్యమానికి మద్దతుగా చిత్రపరిశ్రమ గళమెత్తుతోందని తెలిపింది. 
 
సోషల్ మీడియా వేదికగా 'సేవ్ నల్లమల' అంటూ సినీ ప్రముఖులు నినదిస్తున్నారని చెప్పింది. కథానాయిక సమంత చేంజ్. ఓఆర్‌జీ సంస్థ ద్వారా రాష్ట్రపతికి పంపుతున్న పిటిషన్‌పై సంతకం చేసి తన మద్దతు తెలిపారు. 
 
మరో నటి అనసూయ కూడా మద్దతుగా సంతకం చేశారు. కథానాయకుడు విజయ్ దేవరకొండ ట్విటర్లో స్పందిస్తూ- యురేనియం తవ్వకాల వల్ల నల్లమల నాశనమయ్యే ప్రమాదంలో ఉందని, యురేనియం కొనుక్కోవచ్చుగానీ అడవులను కొనుక్కోలేం కదా అని వ్యాఖ్యానించారు.
 
 యురేనియం తవ్వకాలపై వ్యక్తమవుతున్న ఆందోళనను తాను పరిగణనలోకి తీసుకొంటున్నానని, దీనిని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్తానని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) చేసిన ట్వీట్‌పై విజయ్ స్పందిస్తూ- ఇది తొలి విజయమని చెప్పారు.
 
"నల్లమల పరిరక్షణ జరిగే వరకు ఆపొద్దు. నల్లమలా! నీకు బేషరతుగా మద్దతు తెలిపే కోట్ల మంది సోదర సోదరీమణులున్నారు" అని ఆయన తెలిపారు.
 
 మరో కథానాయకుడు గోపీచంద్ మాట్లాడుతూ- "చెట్లు బాగుంటే మనం బాగుంటాం. వాటిని నాశనం చేస్తే మన జీవితాన్ని మనం చేతులారా నాశనం చేసుకున్నట్లే. నల్లమలను రక్షించుకొందాం" అన్నారు. నల్లమలను రక్షించుకుందామని కథానాయకులు రామ్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కూడా ట్విటర్‌లో చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు