టాలీవుడ్ ప్రేమ పక్షులు నాగచైతన్య, సమంతల వివాహం అక్టోబర్ 6,7 తేదీల్లో అట్టహాసంగా జరుగనుంది. గోవాలో వీరి వివాహం జరుగనుండగా, హైదరాబాదులో గ్రాండ్ రిసెప్షన్ జరుగనుంది. ఈ పెళ్లి వేడుకకు తాను ధరించే లెహంగా ఇదే అవుతుందేమోనని లెహంగా ధరించిన ఫోటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. లేత చందనపు రంగులో వున్న లెహంగాలో సమంత లుక్ అదిరిపోయింది.