ఈ చిత్రంలో నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్‌గా, అమీర్ సన్నిహితుడిగా కన్పించబోతున్నాడు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కరీనా కపూర్ కూడా నటిస్తోంది. అమీర్‌ఖాన్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. లడాక్‌లో ఇప్పుడు మిలట్రీ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే అమీర్ షూటింగ్ మొదలు పెట్టాడు. ఈరోజు సమంత ఫొటోను పోస్ట్‌చేస్తూ చైతు డ్రెస్‌లో చాలా బాగున్నాడంటూ మెచ్చుకుంది.