ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడారు. ఆలియా భట్ నటన గురించి చెప్పాల్సింది లేదు. నా ద్రుష్టిలో సమంత, అలియా ఇద్దరూ సేమ్. సెట్లో చాలా షార్ప్ గా వుంటారు. సమంత అయితే ఎంత యాక్టివ్ అంటే చావు సీన్ లోనూ నవ్వేస్తూ వుంటుంది. వెంటనే రియాక్షన్ మార్చేస్తుంది. గొప్ప ఆర్టిస్టు. అందుకే సమంత మీరు ఎప్పుడూ బొంబాయిలో వుండకండి... అత్తారింటికి దారేదీ లాగా.. సమంతకు హైదరాబాాద్ దారేదీ అని యాష్ టాగ్ తగిలించాలనుంది. సమంత తెలుగులో నటిస్తే నేను కథ రాస్తాను అని అన్నారు.
ఇంకా మాట్లాడుతూ, ఏ సంఘటనలు మనం ఊహించినట్లు జరగవు. కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవి యాక్సెప్ట్ చేయాలి. నదిలో నీటి ప్రవాహం వస్తూనే వుంటుంది. అలానే మనం కూడా నీరులాగా వెళుతూ వుండాలి. మనపని మనం చేసుకుంటూ సాగాలి. ఇది నేను నేర్చుకున్న పాఠం. నేను ఈ ఫంక్షన్ వస్తానని అనుకోలేదు. వచ్చి రెండుగంటలు హ్యాపీగా అనిపించింది అన్నారు.
అలియాభట్ మాట్లాడుతూ,, జిగ్రా అంటే దైర్యం అని అర్థం. ఈ సినిమాలో నటించడం చాలా హ్యాపీగా వుంది. ఆర్.ఆర్.ఆర్. తర్వాత మా ఇంటిలో నాటునాటు సాంగ్ ప్రతిరోజూ పిల్లలు డాన్స్ చేస్తుంటారు. అంతలా నాకు పేరు తెచ్చిపెట్టింది. ఇక త్రివిక్రమ్ గారు సమంత, నేను నటించేలా కథ రాస్తారు అనుకుంటున్నా అని తెలిపారు.