సీనియర్ ఎడిటర్ వెంకటేశ్వర రావు మృతి, చెన్నైలో దహన సంస్కారాలు

మంగళవారం, 20 జూన్ 2023 (16:02 IST)
Senior Editor Venkateswara Rao
ఫిలిమ్  ఇండస్ట్రీలో మరో  విషాదం నెలకొంది.  ప్రముఖ సీనియర్ ఎడిటర్  పి. వెంకటేశ్వర రావు (72) ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు చెన్నైలో  తుది శ్వాస విడిచారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో గొప్ప చిత్రాలకు ఎడిటర్ గా పని చేసిన వేకటేశ్వర రావు ప్రముఖ దర్శకులు కె .  ఎస్ . ఆర్ . దాస్  కు స్వయానా మేనల్లుడు. యన్. టి . ఆర్. నటించిన  యుగంధర్ తో పాటూ  మొండి మొగుడు పెంకి పెళ్ళాం, కెప్టెన్ కృష్ణ, ఇద్దరు అసాధ్యులు, ముద్దాయి వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్ గా పని చేశారు 
 
వెంకటేశ్వర రావు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 200కు పైగా సినిమాలకు పని చేసి సౌత్ ఇండియాలో గొప్ప ఎడిటర్ గా గుర్తిపు పొందారు.  డీఎంకే ఆధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, ప్రముఖ దర్శకుడు కేఎస్ఆర్ దాస్ , పి. వాసు, మంగిమందన్, వై. కె .నాగేశ్వర రావు, బోయిన సుబ్బారావు వంటి ప్రముఖ  దర్శకులతో పని చేసి  ఎన్నో  గొప్ప చిత్రాల ఘన విజయాల్లో కీలక పాత్ర పోషించిన వెంకటేశ్వరరావు ఇక లేరని తెలిసి పలువురు సినీ ప్రముఖులు  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు. 
 
22వ తేదీ  గురువారం  చెన్నైలో దహన సంస్కారాలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు. కాగా వెంకటేశ్వర రావు మృతి పట్ల తెలుగు ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్ పక్షాన  అధ్యక్షులు కోటగిరి  వెంకటేశ్వర రావు (చంటి), ప్రధాన కార్యదర్శి మార్తాండ్ కె వెంకటేష్  సంతాపాన్ని ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు