ఎప్పుడూ ఏదో చర్చల్లో వుండాలనుకునే రామ్‌గోపాల్ వర్మ తాజాగా మరో చర్చకు తావిచ్చారు. తను తీసిన పొలిటికల్ సినిమాలు డిజాస్టర్ కావడంతో అవేవీ పట్టించుకోకుండా మరో సినిమాను తుదిమెరుగులు దిద్దారు. ఈసారి ఆడవారి శారీపై సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకు నా ఆరాధ్య దేవితో నూతన చిత్రం ‘శారీ’ అంటూ సోషల్ మీడియాలో చర్చకు తావిచ్చారు.