మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఖైదీ నెం. 150 సృష్టించిన రికార్డులు గురించి తెలిసిందే. దాదాపు 9 ఏళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం. 150. ఈ చిత్రానికి అనూహ్యమైన వసూళ్లు వచ్చాయి. రూ. 100 కోట్లు దాటింది. ఐతే తాజాగా ఇదే చిత్రం చిరంజీవికి అవమానాన్ని కూడా తెచ్చింది. అదేంటి... రికార్డులు తెచ్చిన సినిమా అవమానం ఎలా తెచ్చిందనేగా మీ అనుమానం.
మరేంలేదు... ఈ చిత్రాన్ని బుల్లితెరపై ఇటీవలే ప్రసారం చేశారు. చిత్రాన్ని ప్రదర్శించేముందు ఎన్నో ప్రకటనలు కూడా చేసారు. బుల్లితెరపై చిరంజీవి ఖైదీ నెం.150 టీఆర్పీ రేటింగులతో ఎక్కడికో వెళుతుందని అనుకున్నారు. కానీ ఫలితం మాత్రం అవమానకరంగా వచ్చింది. అదేంటయా అంటే... కేవలం 6.93 టీఆర్పీ మాత్రమే వచ్చింది. దీనితో అంతా విస్మయానికి గురయ్యారు. చిరంజీవి చిత్రం ఈరకంగా ఎందుకు ఫెయిలయ్యిందని ఆలోచన చేస్తున్నారు.