తెలుగు సినిమా.. దేశానికి చూపిస్తున్నాం: విజయ్ దేవరకొండ

సోమవారం, 15 ఆగస్టు 2022 (18:40 IST)
Vijay Deverakonda, ananya
విజయ్ దేవరకొండ, ద‌ర్శ‌కుడు పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్  ''లైగర్''(సాలా క్రాస్‌బ్రీడ్) ఆగస్ట్ 25న విడుదలౌతుంది. ది గ్రేట్ మైక్ టైసన్ లైగర్ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేస్తున్నారు. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన లైగర్  ట్రైలర్, పాటలు ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలను పెంచాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో ఆగస్ట్ 25న లైగర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హైదరాబాద్ లో 'లైగర్‌’ ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. విజయ్ దేవరకొండ, కథానాయిక అనన్య పాండే ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
 
పెద్ద కలలు ఉండేవి
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. యాక్టర్ అవ్వాలనుకున్నపుడు పెద్ద కలలు ఉండేవి. పెళ్లి చూపులతో ప్రయాణం చిన్నగా మొదలైయింది. అయితే ఆ చిత్రానికి ప్రేక్షకులు చాలా పెద్ద విజయాన్ని ఇచ్చారు. అప్పటి నుండి ప్రేమ పంచుతూనే వున్నారు. హైదరాబాద్ నుండి వెళ్లి ఇండియా మొత్తానికి ఒక కథ చెప్పాలని కలగన్నాం. అది లైగర్ తో చేస్తున్నాం. ఇండియాలో ఎక్కడికి వెళ్ళిన పెద్ద ఎత్తున ప్రేమ లభించింది. కానీ ఎప్పుడూ మర్చిపోలేని ప్రేమ ఇక్కడి నుండే మొదలైయింది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సమయంలో ఇక్కడ కాలేజీల్లో తిరుగుతుంటే మన పిల్లలు ఇచ్చిన ప్రేమ మర్చిపోలేను. ఇదంతా మన థియేటర్లలోనే మొదలైయింది. లైగర్ పై మేము చాలా కాన్ఫిడెంట్ గా వున్నాం. ఇండియా షేక్ అవుతుంది. ఆగస్ట్ 25  మీ అందరికీ నచ్చే సినిమా, మీరంతా పూర్తిగా ఎంజాయ్ చేసే సినిమా ఇస్తాం'' అన్నారు
 
అనన్య పాండే మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా మాకు గొప్ప ప్రేమ లభించింది. హైదరాబాద్ లో తెలుగు ప్రేక్షకులు పంచిన ప్రేమ మర్చిపోలేనిది. లైగర్ నా మొదటి తెలుగు సినిమా. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.'' అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు