ఇక సెట్‌లో ప్రతీరోజూ జనరల్ ఫిజీషియన్ అందుబాటులో ఉండేవారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలని దర్శకుడు పాపరావు బియ్యాల ఎంతో కష్టపడి తెరకెక్కించారు. మేరీ డిక్రూజ్, మనోజ్ (శియా సరన్, శర్మాన్) పాత్రలు కళలు, సంగీతం, కల్చర్ విద్యల మీద ప్రభావం చూపించేలా ఉంటాయి.
దర్శకుడు పాపారావు బియ్యాల మాట్లాడుతూ.. మ్యూజిక్ స్కూల్ సినిమా రెండో షెడ్యూల్ అద్భుతంగా జరిగింది. టీం అంతా కూడా ఎంతో ఎంజాయ్ చేశాం. ఇక ఈ మూడో షెడ్యూల్‌ను కొత్త ఏడాదిలో కొత్త ఎనర్జీతో ప్రారంభించాం. అదే సమయంలో అందరి రక్షణ గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. ఎవరైతే అవసరమో వారినే సెట్ మీదకు రానిచ్చాం. ఇక శానిటైజేషన్ టీం మాత్రం ఈ షెడ్యూల్ జరిగినన్నీ రోజులు ఎంతో జాగ్రత్తగా అందరినీ చూసుకుంది అని అన్నారు.
ఈ చిత్రంలో శర్మాన్ జోషి, శ్రియా సరన్, షాన్, సుహాసిని ములై, ప్రకాష్ రాజ్, బెంజమిన్ గిలాని, శ్రీకాంత్ అయ్యంగార్, వినయ్ వర్మ, మోనా అంబెగోయెంకర్, గ్రేసీ గోస్వామి, ఒజు బరువా, బగ్స్ భార్గవ, మంగల భట్, ఫని ఎగ్గోటి, వక్వర్ షైక్ తదతరులు నటిస్తున్నారు.