ఈ సందర్భంగా దర్శకుడు పాపారావు బియ్యాల మాట్లాడుతూ ఇళయరాజాగారి స్టూడియోలో షాన్ పాట పాడుతున్నప్పుడు తనలోని విలక్షణత నాకు నచ్చింది. అలాంటి ఓ పాత్ర నా సినిమాకు అవసరం అని భావించాను. సాధారణంగా సింగర్స్ ఎవరూ అదే సినిమాలో నటించలేదని నేను భావిస్తున్నాను. ఇది షాన్‌కు కొత్త అనుభవాన్ని ఇస్తుంది. అందుకనే నటుడిగా తనకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చాను. సింగర్‌గా కొన్నేళ్ల నుంచి షాన్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే మ్యూజిక్ స్కూల్ చిత్రంతో తను నటుడిగానూ మెప్పించబోతున్నారు. షాన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ఈ చిత్రంలో ప్రేక్షకులను ఎగ్జయిట్‌మెంట్ చేసే అంశాలెన్నో ఉన్నాయి. మిమ్మల్ని థియేటర్స్‌లో కలవడానికి ఎదురుచూస్తున్నాం అన్నారు.
షాన్ మాట్లాడుతూ మ్యూజిక్ స్కూల్లో భాగం కావడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తుంది. ఈ సినిమాలో పాట పాడటమే కాదు, నటుడిగా కనిపిస్తాను. నటించడం నాకు కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చింది. మాస్ట్రో ఇళయరాజాగారు ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండటం గొప్ప విషయం. సృజనాత్మక కళలను ప్రోత్సహించాలని చెప్పే సినిమా ఇది. మ్యూజిక్‌లో చాలా వేరియేషన్స్‌ను చూపించే ఈ సినిమాలో..కళలు, ఆటలు కూడా పిల్లల జీవితంలో ముఖ్యమని చెబుతారు. సినిమాలోని ప్రధానాంశం నాకు వ్యక్తిగతంగా ఎంతగానో నచ్చింది. ఇలాంటి ఓ కాన్సెప్ట్‌తో సినిమాను చేస్తున్న పాపారావుగారికి థాంక్స్. అలాగే ఈ సినిమాలో పాట పాడటంతో పాటు నటించే అవకాశం వచ్చింది. ఇది నాకెంతో థ్రిల్లింగ్‌గా ఉంది అన్నారు.
యామిని ఫిలింస్ నిర్మించనున్న మ్యూజిక్ స్కూల్ సినిమా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతుంది. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. బ్రాడ్ వే కొరియోగ్రాఫర్ ఆడమ్ ముర్రే కొరియోగ్రఫీ అందిస్తున్నారు. పాపారావు బియ్యాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో శర్మన్ జోషి, శ్రియా శరన్, సుహాసిని ములే, బెంజిమిన్ గిలాని, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, వినయ్ వర్మ, గ్రేసీ గోస్వామి, ఓజూ బారువా ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ సినిమాలో 12 పాటలుంటాయి. పిల్లలకు కళలు, ఆటల ప్రాధాన్యతను తెలియనీయకుండా కేవలం వారిని ఇంజనీర్లు, డాక్టర్స్‌గా చూస్తూ మూస పద్ధతిలో ఉంటూ ఎలాంటి క్రియేటివిటీలేని నేటి విద్యావ్యవస్థలో పిల్లలు తెలియని ఒత్తిడికి లోనవుతున్నారని చెప్పడమే ఈ సినిమా ప్రధానాంశం.