నేను చాలా రొమాంటిక్ హీరోయిన్‌‍ను అందుకే విజయాలు : శృతిహాసన్

గురువారం, 20 అక్టోబరు 2016 (09:19 IST)
అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా శ్రుతిహాసన్ హీరోయిన్‌గా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ''ప్రేమ‌మ్''. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పైన సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ద‌స‌రా కానుక‌గా రిలీజైన ప్రేమ‌మ్ చిత్రం అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. ఇదిలావుంటే... క‌మ‌ల్ హాస‌న్ కూతురు అనే ట్యాగ్‌లైన్‌తో హీరోయిన్‌గా అడుగుపెట్టిన శ్రుతి హాస‌న్‌.. త‌న గ్లామ‌ర్‌, పెర్‌ఫార్మెన్స్‌తో ఈ సినిమాతో టాలీవుడ్‌లో ప్ర‌త్యేక గుర్తింపును పొందింది. 
 
తెలుగు, త‌మిళం‌, హిందీ భాష‌ల్లో నాయిక‌గా పేరు తెచ్చుకున్న శ్రుతిహాస‌న్‌.. మిగిలిన చోట్ల కంటే టాలీవుడ్‌లోనే మంచి స‌క్సెస్‌గ్రాఫ్‌ని మెయిన్‌టెయిన్ చేస్తోంది. విజ‌య‌వంత‌మైన సినిమాలు అమ్మ‌డి ఖాతాలో చేరిపోయింది. ఇదిలావుంటే... తాను చాలా 'రొమాంటిక్' అని శ్రుతి హాసన్ తనకు తాను కితాబు ఇచ్చుకుంది. 
 
హిందీ టీవీ ఛానెల్ నిర్వహించిన 'దీవాలీ మస్తీ' కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, సినీ ప్రేక్షకులు మాత్రం తనను రాకర్‌‌గా భావిస్తారని... నిజానికి తను చాలా రొమాంటిక్‌‌గా ఉండేందుకు కొంత స్ఫూర్తి కావాలని వెల్లడించింది. అవతలి వాళ్లు మరీ సిల్లీ ఫెలో అయితే రొమాంటిగ్గా ఉండలేనని తన  మనసులోని మాటను చెప్పింది. అభిమానులు మాత్రం రాక్ సంగీత కార్యక్రమాల్లో పాల్గొనాలని అనుకుంటారని చెప్పింది.

వెబ్దునియా పై చదవండి