బాలీవుడ్ బిగ్ బాస్ ముగిసింది. ఫలితంగా బిగ్ బాస్ 13వ సీజన్‌కు శుభం కార్డు పడింది. ఫైనల్లో బాలికా వధు ఫేం సిద్ధార్థ్ శుక్లా మొదటి స్థానంలో నిలిచాడు. అసిమ్ రియాజ్ తర్వాతి స్థానంలో నిలిచారు. ఎంతో ఉత్కంఠగా, ఉద్వేగ భరితంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఫైనల్‌కు సిద్దార్థ్‌తో పాటు..నటుడు అసీం రియాజ్‌లు చేరుకున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 13కి హోస్ట్‌గా వ్యవహరించారు.