తన వైవాహిక జీవితంలో తాను చాలా ఇబ్బందులు పడ్డానని.. సింగర్ కౌసల్య తెలిపింది. అప్పట్లో తమ బాబు చాలా చిన్న పిల్లవాడు. అతనికి తండ్రి ప్రేమ చాలా అవసరం. అందువలన ఓపికగా కష్టాలను భరించాను. కానీ తన భర్త ఇంకో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకునే వరకూ సర్దుకుపోయానని.. కానీ కుదరలేదని.. కౌసల్య చెప్పింది.