Director Vijaya Bhaskar Reddy
అరవింద్ కృష్ణ, నటాషా దోషి హీరో హీరోయిన్లుగా విజయ భాస్కర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం S.I.T (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం). ఈ చిత్రాన్ని నాగి రెడ్డి, తేజ పల్లి, శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీ మే 10 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమా క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ ఆడియెన్స్‌ని ఓటీటీలో బాగానే ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి మంచి ఆదరణ వస్తుండటంతో దర్శకుడు విజయ భాస్కర్ రెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఆయన తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.