మ్యాడ్ నెస్ ఎప్పటికీ మారదు అంటున్న సుడిగాలి సుధీర్

శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (17:18 IST)
sudheer,venu, srinu
సుడిగాలి సుధీర్ జబర్దస్త్ తో పాపులర్. ఆ విషయం తెలిసిందే. శ్రీదేవి డ్రామా కంపెనీ టివి. షో కూడా చేస్తున్నాడు. మల్టి టాలెంట్ పర్సన్. బలగం సినిమాతో తిళ్లు వేణు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. గెటప్ శ్రీను కూడా. ఈ ముగ్గురు దోస్తులు. ఇటీవలే వీరంతా ఓ సందర్భంలో ఇలా మంచు ప్రదేశంలో షికారు వెళ్లి ఎంజాయ్ చేస్తూ తమ అనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ మా మ్యాడ్ నెస్ ఎప్పటికీ మారదు అంటూ పోస్ట్ చేశారు. 
 
వేణు దర్శకుడిగా మరో సినిమా చేయబోతున్నాడు. గెటప్ శ్రీను సినిమాల్లో క్యారెక్టర్ నటుడిగా మారాడు. సుడిగాలి సుధీర్ మాత్రం హీరోగా చేస్తున్నాడు. గత కొంత కాలంగా సుడిగాలి సుధీర్ తన బాడీని ఒక షేప్ లో తీసుకువచ్చాడు. ఈ సినిమా జులైలో సెట్ పైకి వెళ్లనుంది. దీనికి పాగల్ నరేష్ దర్శకుడు. బెక్కెం వేణుగోపాల్ ఈ సినిమాను చంద్ర శేఖర్ రెడ్డి తో కలిసి నిర్మిస్తున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు